వనపర్తి పట్టణంలో వివాహిత అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. గాంధీనగర్ కాలనీకి చెందిన వడ్లకొండ లక్ష్మి (36) భర్తతో వివాదం తర్వాత గురువారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ దొరకలేదు. కుమారుడి ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.