కన్నడ స్టార్ రిషబ్ శెట్టి తన సోషల్ మీడియా ఖాతాలో నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’తో పాటు రుక్మిణి వసంత్, రాజ్ బి శెట్టిలను అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశమైంది. దీంతో ‘కాంతార’ టీమ్‌లో విభేదాలు ఉన్నాయనే వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే సంస్థ అధినేత విజయ్ కిరగందూర్ను ఆయన ఇంకా ఫాలో అవుతున్నాడు. ఈ వివాదంపై అటు రిషబ్ కానీ, ఇటు నిర్మాణ సంస్థ కానీ ఇంకా స్పందించలేదు.