W.G: తక్కువ ధరకే కారు కొనిపిస్తానని నమ్మించి రూ.4.50 లక్షలు కాజేసిన వ్యక్తిపై నరసాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు యర్లగడ్డ ప్రదీప్ కుమార్కు బంధువైన గాబ్రియేల్ రాజు వివిధ విడతల్లో నగదు తీసుకుని మోసగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కారు కొనివ్వకపోగా, తిరిగి డబ్బులు ఇవ్వమని అడిగితే నిరాకరించడంతో ప్రదీప్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.