ADB: ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. పదో తరగతికి 4, ఇంటర్‌కు 3 కేంద్రాలు కేటాయించారు. ప్రతి కేంద్రంలో సీసీటీవీ నిఘా, తాగునీరు, వెలుతురు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పరీక్షా పత్రాల రవాణా, భద్రత కోసం పోలీస్ శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు.