TPT: సూళ్లూరుపేటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC – SHAR)ను తిరుపతి ఐఐటీ ప్రతినిధుల బృందం సందర్శించారు. స్పేస్ సైన్స్ స్కూల్ ఏర్పాటు, అధునాతన టెక్నాలజీపై చర్చించినట్లు తిరుపతి ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో SHAR డైరెక్టర్ పద్మ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ గోపికృష్ణ పాల్గొన్నారు.