ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సంస్కృతిని మరోసారి చాటుకున్నాడు. శ్రీరామనవమి సందర్భంగా జపాన్ గీక్ పిక్చర్స్ సీఈఓ టొమాట్సు కోసానోకు ‘సీతారామ కళ్యాణం’ చిత్రపటాన్ని బహూకరించాడు. భారతీయ సంప్రదాయాలు, శ్రీరాముడి కథా ప్రాముఖ్యతను వారికి వివరించి గ్లోబల్ వేదికపై మన ఆధ్యాత్మిక విలువలను చాటాడు. ఒక స్టార్ హీరోగా భారతీయ వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం విశేషం.