NLR: మంత్రి నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు 8వ డివిజన్లో జరుగుతున్న కాలువ ఆధునీకరణ పనులను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. పేదలకు ఇబ్బంది కలగకుండా పనులు పూర్తి చేస్తామని, గతంలో ఇక్కడ నివసించిన వారందరికీ పనులు పూర్తయ్యాక తిరిగి ఇక్కడే స్థలాలు కేటాయిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.