SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో గత తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న శ్రీరామనవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ఉగాది పర్వదినం సందర్భంగా 19వ తేదీ గురువారం ప్రారంభమైన ఉత్సవాలలో భాగంగా చివరి రోజైన 27వ తేదీ శుక్రవారం సీతారామ చంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం, రథోత్సవం నిర్వహించారు. రాత్రి రాజన్న ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి.