MDK: పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని జెవీవో ఖాజా సలావుద్దీన్ కోరారు. పాపన్నపేటలో ప్రచార రథం ద్వారా వ్యాధి లక్షణాలపై పశుపోషకులకు అవగాహన కల్పించారు. 3 నెలలు దాటిన గేదె, గోజాతి పశువులకు తప్పక టీకాలు వేయించి, చెవిపోగు ద్వారా ‘భారత్ పశుధాన్’ యాప్లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఉచితంగా అందిస్తున్న ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని కోరారు.