ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగితే శరీరంపై ప్రభావం పడుతుంది. ఖాళీ కడుపులో కెఫీన్, ఆమ్ల పదార్థాలు వేగంగా పనిచేస్తాయి. ఇది ఒత్తిడి హార్మోన్లను పెంచి శరీర సమతుల్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఖాళీ కడుపుతో కాఫీ తాగితే కడుపులో మంట, అసౌకర్యం, జీర్ణ సమస్యలు, గ్యాస్ లేదా ఎసిడిటీకి దారితీస్తుంది. అలాగే, రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులు, నిద్ర సమస్యలు, రోజంతా అలసట ఏర్పడే అవకాశం ఉంటుంది.