జమ్మూకశ్మీర్ తమ తొలి రంజీ ట్రోఫీ(2025/26)ని అందుకోవడంలో ఆకిబ్ నబీ 60 వికెట్లతో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. IPLలో ఢిల్లీకి ఆడనున్న ఈ ప్లేయర్.. తన అంతిమ లక్ష్యం భారత్కు ప్రాతినిధ్యం వహించడమేనని తెలిపాడు. తనను వేలంలో ఢిల్లీ రూ.8.40 కోట్లకు తీసుకోవడం సంతోషంగా ఉందన్నాడు. IPLలో మెరుగ్గా రాణించి జాతీయ జట్టులో ఆడే ఛాన్స్ పొందితే తన కల నిజమైనట్లేనని పేర్కొన్నాడు.