NDL: ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీ, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ‘జీరో వేస్ట్ ఇనిస్టిట్యూషన్స్’ అమలు చేయాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. వ్యర్థాల వర్గీకరణ, కంపోస్టింగ్, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ చర్యలతో స్వచ్ఛత పెంపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా నిర్ణయించారని తెలిపారు.