SKLM: కవిటి ఉపకేంద్రం పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం ఆదివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఆ శాఖ పలాస ఈఈ యజ్ఞేశ్వర రావు తెలిపారు. గొండ్యాలపుట్టుగ, ప్రగడపుట్టుగ, పుక్కళ్లపాలెం, జాలారిపాలెం, కొత్తపాలెం, కవిటి కొత్తూరు, కవిటి టౌన్‌కు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సరఫరా నిలిపివేసినట్లు తెలిపారు.