MBNR: జానంపేట గ్రామంలోని శ్రీ గంగారం గుట్ట ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఉన్న విద్యుత్ సమస్యకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చొరవతో పరిష్కారం లభించింది. భక్తుల ఇబ్బందులను గుర్తించి అధికారులతో మాట్లాడి ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయించారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.