TG: హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి భానుడు భగభగలాడగా, కాసేపటి క్రితం ఉరుములతో కూడిన వర్షం మొదలైంది. జూబ్లీహిల్స్, కొంపల్లి, సుచిత్ర, అల్వాల్, శేరిలింగంపల్లి, చందానగర్, నిజాంపేట్, KPHB, మూసాపేట్, కాప్రా వంటి ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. ఈ వర్షంతో నగరవాసులు వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.