ఆస్ట్రేలియా దేశవాళీ మ్యాచ్లో ఇమ్రాన్ ఖాన్ టీ-షర్ట్ ధరించిన అభిమానిని సెక్యూరిటీ అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా రంగంలోకి దిగింది. ఇమ్రాన్ కేవలం రాజకీయ నాయకుడే కాదని, ప్రపంచకప్ విజేత అని గుర్తుచేసింది. మానవతా దృక్పథంతో చూడాలంటూ ఆ అభిమానిని స్టేడియంలోకి అనుమతించింది. ప్రస్తుతం ఇమ్రాన్ అనారోగ్యంతో పాకిస్తాన్ జైలులో విషయం తెలిసిందే.