TG: HYDలో భారీగా కుళ్లిన చికెన్ పట్టుబడింది. 352 కిలోల కుళ్లిన చికెన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలు హోటల్స్, రెస్టారెంట్లకు కుళ్లిన చికెన్‌ను సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. చికెన్ సరఫరా చేస్తున్న సూరజ్ పాల్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇటీవల పార్శీగుట్టలోనూ కుళ్లిన చికెన్ పట్టుబడిన విషయం తెలిసిందే.