HNK: కాజీపేటలోని స్వయంభూ శ్రీ శ్వేతార్క మూలగణపతి క్షేత్రంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్ర యుక్త ముహూర్తాన వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈ వేడుక కన్నులపండువగా సాగింది. గత 300 ఏళ్లకుపైగా అడ్లురి వంశస్థులు ఆరాధిస్తున్న పురాతన పంచలోహ విగ్రహాలకు కళ్యాణం జరిపించడం విశేషం.