సంజూ శాంసన్, ఆయుష్ మాత్రే కలిసి టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడం ఓ ‘డ్రీమ్ కాంబో’ అని CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. ఈ జోడీని రజినీకాంత్, కమల్ హాసన్‌లతో పోల్చాడు. ఈ సీజన్లో ఈ ఇద్దరు టాలెంటెడ్ ప్లేయర్లు కలిసి ఆడే అవకాశం ఖచ్చితంగా వస్తుందని తాను నమ్ముతున్నట్లు రుతురాజ్ పేర్కొన్నాడు. వీరిద్దరూ క్రీజులో ఉంటే పరుగుల సునామీ ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు.