కృష్ణా: తేలప్రోలులోని RCM చర్చి వద్ద యేసు తిరు హృదయ మహోత్సవాలు శుక్రవారం భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. రెండో రోజు ఫాదర్ సంకుర్ల శాంతిరాజు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలు నిర్వహించారు. యేసు క్రీస్తు ప్రేమ, క్షమ, దయ గుణాల ప్రాధాన్యతను విశ్వాసులకు వివరించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.