కోనసీమ: మండపేట పట్టణంలో ఆస్తి పన్నులు చెల్లించకపోతే చర్యలు తప్పవని పుర పాలక సంఘం కమీషనర్ TV రంగారావు తెలిపారు. ఖాళీ స్థలాలు పన్నులు చెల్లించక పోతే ఆయా స్థలాలను మున్సిపాల్టీ స్వాధీనం చేసుకొని అక్కడ ప్లెక్సీలు ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం శ్రీ రామ నవమి సెలవు అయినప్పటికి సిబ్బందితో పన్నులు వసూలు చేసే విధులు నిర్వహించామని పేర్కొన్నారు.