కృష్ణా: నందివాడ మండలంలోని పోలుకొండ గ్రామంలో ప్రభుత్వ సర్వ శిక్ష అభియాన్ నిధులు రూ. 26 లక్షలతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించాలన్నారు.