AP: ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్‌పై ఆదివాసి సంఘాలు ఆగ్రహించాయి. ఆదివాసీల మీద ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అభ్యంతరం చెప్పాయి. బెందాళం అశోక్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. లేకుంటే ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసులు పెడతామని హెచ్చరించాయి.