MBNR: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఇవాళ జడ్చర్ల పట్టణంలో వివిధ ఆలయాల్లో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి గారు పాల్గొన్నారు. శ్రీ సీతారాముల వారిని దర్శించుకొని అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరాముడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో వెలుగొందాలని ఆకాంక్షించారు.