AP: విద్యార్థుల కోసం ప్రత్యేక డిజిటల్ హెల్త్ పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆరోగ్యం సంరక్షణ, మానసిక వికాసం, HIV అంశాలపై పోర్టల్‌లో సమాచారం ఉంటుందని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా apshwp.ap.gov.inను రూపొందించినట్లు వెల్లడించారు. ఈ- లెర్నింగ్ ద్వారా నేర్చుకోవడానికి వీలుగా హెల్త్ పోర్టల్ ఉంటుందని పేర్కొన్నారు.