రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడి చిన్ననాటి ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ ఫొటోలు చూసిన చరణ్ భార్య ఉపాసన చేసిన కామెంట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తమ చిన్న కుమార్తె అన్వీరా అచ్చం తండ్రి (రామ్ చరణ్) లాగే ఉంటుందని ఉపాసన పేర్కొంది. కాగా, చరణ్, ఉపాసన దంపతులకు క్లీంకారా తర్వాత కవలలు శివరామ్, అన్వీరా జన్మించారు.