MNCL: మందమర్రి మండలంలోని పొన్నారం గ్రామం మూడవ వార్డులో శుక్రవారం నూతన సీసీ రోడ్డు పనులను సర్పంచ్ పెంచాల మధు ప్రారంభించారు. ఉపాధి హామీ(NREGS) నిధులు రూ.13.80లక్షలతో సీసీ రోడ్డు పనులను చేపట్టినట్లు సర్పంచ్ పేర్కొన్నారు. నాణ్యతతో పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అమృత, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.