TPT: పాకాల మండలం దామలచెరువులోని శ్రీసీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో సీతారాముల కళ్యాణం శనివారం రాత్రి నిర్వహించనున్నట్లు ప్రధాన అర్చకులు VS క్రిష్ణమూర్తి స్వామి, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కళ్యాణోత్సం అనంతరం స్వామివారికి పుష్ప పల్లకి సేవ జరుగుతుందన్నారు. ఈనెల 18వ తేదీ నుంచి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.