అక్కినేని నాగార్జునతో నటి ఐశ్వర్య రాజేష్ జత కట్టనున్నట్లు తెలుస్తోంది. నాగ్, తమిళ దర్శకుడు రా. కార్తీక్ కాంబోలో ‘కింగ్ 100’ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో ఐశ్వర్య కథానాయికగా నటించనుందట. ఈ మేరకు ఆమెను మేకర్స్ సంప్రదించగా ఓకే చెప్పినట్లు సమాచారం. త్వరలోనే ఐశ్వర్య సెట్స్‌లో జాయిన్ కానున్నట్లు టాక్.