రోజూ గుప్పెడు పిస్తా పప్పులు తింటే బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకలి త్వరగా వేయదు. తద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచి, కణాల నాశనాన్ని అరికడతాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి.