పులుపు, వగరు రుచులు కలగలిసిన వాక్కాయథ్ బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కేకులు, ఐస్‌క్రీమ్‌లలో వాడే టూటీ ఫ్రూటీలను వీటితోనే తయారు చేస్తారు. విటమిన్లు, ఐరన్ సమృద్ధిగా ఉండే ఈ కాయలు రోగనిరోధక శక్తిని పెంచి.. రక్తశుద్ధికి, ఒత్తిడిని తగ్గించడానికి తోడ్పడతాయి. చింతపండుకు ప్రత్యామ్నాయంగా వీటిని పచ్చళ్లు, వంటల్లో విరివిగా ఉపయోగిస్తారు.