వాట్సాప్ తన వినియోగదారుల కోసం అద్భుతమైన ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఆండ్రాయిడ్, ఐఫోన్ల మధ్య చాట్ హిస్టరీ, మీడియాను సులభంగా బదిలీ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఐఫోన్ వినియోగదారులు కూడా ఒకే ఫోన్లో రెండు అకౌంట్లను వాడుకోవచ్చు. స్టోరేజీని మేనేజ్ చేసేందుకు పెద్ద ఫైళ్లను త్వరగా తొలగించే ఆప్షన్ కూడా ఇచ్చారు.