స్పెయిన్ బ్యాడ్మింటన్ దిగ్గజం కరోలినా మారిన్ రిటైర్మెంట్ ప్రకటించింది. బ్యాడ్మింటన్లో తన ప్రయాణం ముగిసిందని ఆమె SM వేదికగా భావోద్వేగపూరిత పోస్ట్ చేసింది. కొంతకాలంగా తనను వేధిస్తున్న మోకాలి గాయం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 2016 రియో ఒలింపిక్స్లో సింధును ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించిన మారిన్, మూడుసార్లు వరల్డ్ ఛాంపియన్గా కూడా నిలిచింది.