అన్నమయ్య: మదనపల్లె జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల, పాలిసెట్–2026 పరీక్షకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఏప్రిల్ 2 నుంచి 23 వరకు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే శిక్షణ తరగతులు నిర్వహించబడతాయన్నారు.