HYD: రహమత్ నగర్‌కు చెందిన ఎంబీఏ విద్యార్థిని సంతోషిణి తన పెంపుడు కోడిపై వినూత్నంగా ప్రేమను చాటుకున్నారు. ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లడం ఇష్టం లేక.. రంధ్రాలున్న బ్యాగులో కోడిని ఉంచి తన ద్విచక్ర వాహనంపై స్నేహితురాలి ఇంటికి తీసుకెళ్లారు. రెండు కోడిపిల్లలను తెచ్చుకోగా.. ప్రస్తుతం ప్రాణంతో ఉన్న ఈ ఒక్క కోడిని తను ఎంతో అపురూపంగా పెంచుతున్నట్లు ఆమె తెలిపారు.