మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు. ‘చిన్నప్పుడు నా చేయి పట్టుకోవడం నుంచి నేడు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవడం వరకు.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది చరణ్. నీ క్రమశిక్షణ, కుటుంబంపై బాధ్యత, దైవచింతన నీపై నా ప్రేమను మరింత పెంచుతున్నాయి. దేవుడి దీవెనలతో నువ్వు మరిన్ని శిఖరాలు అధిరోహించాలి’ అని పేర్కొన్నారు.