అన్నమయ్య: విధులకు సక్రమంగా హాజరు కాని టీచర్ను సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ సహాయ సంచాలకులు రవికుమార్ తెలిపారు. వీరబల్లి ఉప్పరపల్లెలోని ఎంపీపీ పాఠశాలలో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి 2022 జూలై 1 నుంచి ఎటువంటి సమాచారం లేకుండా, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా గైర్హాజరు అవుతున్నట్లు పేర్కొన్నారు. ఎంఈవో నోటీసులకు స్పందించకపోవడంతో సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు.