TPT: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరుగుతోంది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి కృష్ణ తేజ అతిథి భవనం వరకు భక్తులు వేచి ఉన్నారు. గురువారం 65,600 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 24,292 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.18 కోట్లుగా నమోదైంది.