CTR: జిల్లాలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు టిప్పర్లను సీజ్ చేసినట్లు చిత్తూరు టూ టౌన్ పోలీసులు నిన్న తెలిపారు. ఆంధ్ర నుంచి తమిళనాడుకు రెండు టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తుండగా యాదమరి జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టి పట్టుకున్నట్లు వెల్లడించారు. ఆ రెండు వాహనాలతో పాటు నాలుగు మొబైల్ ఫోన్లు సీజ్ చేశామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.