పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం పీ.లేవిడి గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీరాములవారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.