తిరుపతి జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవాలని ఎస్పీ సుబ్బరాయుడు సూచించారు. జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ వ్యవస్థ, సత్యం, ధర్మానికి రామాయణం ఆదర్శమన్నారు. వేడుకల్లో ఎటువంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని కోరారు.