MBNR: కోయిలకొండ సమీపంలోని రామకొండ గుట్ట భక్తి పరవశంతో కళకళలాడుతోంది. ఈ కొండపై శ్రీరాముని పాదముద్రలు ఉన్నాయని భక్తుల గాఢ విశ్వాసం. వనవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడ విరామం తీసుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్థానిక ఆలయం నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహాలను డోలు, డప్పు వాద్యాల నడుమ ఘనంగా ఊరేగింపుగా తీసుకువచ్చారు.