NDL: బనగానపల్లి మండలం నందవరంలో వెలసిన శ్రీ చౌడేశ్వరిదేవికి శ్రీరామనవమి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, ఛైర్మన్ పీవీ నాగార్జున రెడ్డి, ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. తెల్లవారుజామున అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి కుంకుమార్చన, రుద్రాభిషేకం, మహామంగళ హారతి నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.