PLD: శ్రీరాముల నవమిపండుగను శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కృష్ణారావు సూచించారు. జిల్లాలోని ప్రధాన రామాలయాల వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. శోభయాత్రలు, కళ్యాణ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మత సామరస్యంతో, సోదరభావంతో జరుపుకుని ప్రజలను కోరారు.