KMM: జిల్లా అదనపు కలెక్టర్ పి. శ్రీజ జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని గురువారం సందర్శించి, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, ఇతర మెరుగుదలలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఇందిరా మహిళా డైరీ, మహిళా మార్ట్ పనితీరును సమీక్షించిన ఆమె, మహిళా సంఘాల ద్వారా నడిచే ఈ కేంద్రాలను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు.