TG: అసెంబ్లీలో మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డిపై మంత్రి సీతక్క మండిపడ్డారు. ‘మేం కాంగ్రెస్ను కాపాడటానికి వచ్చాం.. పార్టీలో పుట్టి పెరిగిన మీరు ఏం చేశారు?’ అని ప్రశ్నించారు. పదవి ఇచ్చి ఉండమని బతిమిలాడినా వెళ్లారని విమర్శించారు. ‘మేం అడవి బిడ్డలం.. మీరు ఉన్నత వర్గాల వారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘కేసీఆర్ ఉంటేనే నీళ్లొస్తాయా? ఇప్పుడు రావట్లేదా?’ అంటూ చురకలంటించారు.