చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దేవాలయాలు, శోభాయాత్రల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. సీసీటీవీ, డ్రోన్ పర్యవేక్షణతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, గుంపుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. అనుమానాస్పద విషయాలు గమనిస్తే 112కు సమాచారం ఇవ్వాలన్నారు.