BHPL: జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా నిరంతరంగా, పారదర్శకంగా కొనసాగాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. ఇవాళ BHPLలోని లక్ష్మి ఫిల్లింగ్ స్టేషన్ (HP పెట్రోల్ బంక్)ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తమవుతున్న వదంతులను నమ్మవద్దని, అవసరానికి మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.