SDPT: హుస్నాబాద్ స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద కీ.శే.కామ్రేడ్ అయిలేని మోహన్ రెడ్డి వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఐ నాయకుడిగా 25 ఏళ్ల పాటు కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన పోరాటాలను పలువురు గుర్తు చేసుకున్నారు. ప్రజా సేవలో ఆయన చూపిన బాట నేటికీ ఆదర్శమని కొనియాడారు.