AP: రాష్ట్రంలో బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఎడ్సెట్-2026 పరీక్ష మే 8న నిర్వహించనున్నారు. పాత షెడ్యూల్ ప్రకారం మే 4న జరగాల్సి ఉండగా తాజాగా మార్పులు చేశారు. మొదటి షిప్టు (మ్యాథ్స్, బయాలజీ, ఫిజికల్ సైన్స్ పేపర్లు) ఉదయం 9 నుంచి 11 వరకు, షిఫ్టు-2 (సోషల్ స్టడీస్, ఇంగ్లిష్) మధ్యాహ్నం 2 నుంచి 4వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది.